హైదరాబాద్ లోనే అనంత పద్మనాభుడు..సాఫ్ట్ వేర్ వాళ్లకి సంతోష పరంధాముడు

updated: March 25, 2018 18:31 IST
హైదరాబాద్ లోనే అనంత పద్మనాభుడు..సాఫ్ట్ వేర్ వాళ్లకి సంతోష పరంధాముడు

అనంత పద్మనాభ స్వామి అనగానే మనందరి ఆలోచనలు కేరళకు వెళ్ళిపోతారు. తిరువనంతపురంలోని శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయంలో ఉన్న నేలమాళిగ,నాగబంధం కోట్ల కొలిదీ సంపద, దాని వెనక ఉన్న మిస్టరీ గుర్తుకు వస్తాయి. అయితే సాప్ట్ వేర్ వాళ్లకి మాత్రం హైదరాబాద్ మణికొండ దగ్గరలో లాంకో హిల్స్ సమీపంలో ఉన్న అనంత పద్మనాభ దేవాలయం గుర్తు వస్తుంది. ఎందుకంటే వీకెండ్ వచ్చిందంటే వాళ్లంతా ఫ్యామిలీలతో ,ఫ్రెండ్స్ తో వాలిపోయేది అక్కడే కదా.

ఆశ్చర్యంగా ఉంది కదూ ..అసలు అనంత పద్మనాభుడు హైదరాబాద్ లో ఉండటమనే విషయం. అయితే  ఆర్తితో పిలిస్తే భక్తులను ఆదుకుండాన , అనంతమైన ఆ పరమాత్ముడు కోరిన కోరికలు తీర్చేటందుకు ఇక్కడ కొలువున్నాడని..ఆ క్షేత్రమే ఈ అనంత పద్మనాభక్షేత్రం అని చెప్తారు. భక్తితో పాటు రాక్ క్లైంబింగ్ కు, వీకెండ్ హ్యాంగవుట్ కు ఈ స్దలం చాలా అనువుగా ఉంటుందని వెళ్లినవాళ్లు చెప్తూంటారు. ఇదొక గొప్ప క్షేత్రమే కాక..రిలాక్సేషన్ కు గొప్ప లొకేషన్ అని చాలా మంది సాఫ్ట్ వేర్ నిపుణులు ఇక్కడకు వెళ్లి చెప్తున్నారు.  చాలా ఆహ్లాదంగా ఉండే వాతావరణమే ఈ ప్లేస్ కు వెళ్లటం వెనక ఉన్న అసలైన పరమార్దం అని అందరూ ఒప్పుకునే సత్యం.

అంతే కదా ..ఇటు భగవంతుడు దర్శనం, అటు రిలేక్సేషన్ రెండూ ఒకేసారి అదీ హైదరాబాద్ లాంటి సిటీలో దొరకటం కష్టం కదా..ఆ లోటుని తీరుస్తోంది ఈ దేవాలయం..రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా బాగా భక్తుల తాకిడి పెరిగేటట్లు ఉంది. వీలుంటే మీరు కూడా ఓ సారి చూసిరండి..పుణ్యం,పురషార్దం రెండూ ఒకేసారి లభిస్తాయి. ఇదిగో ఇక్కడ మీకు ఆ దారికి సంభందించిన గూగుల్ మ్యాప్ ఇస్తున్నాం.

 

 

comments